header ads

ఓ మనిషి ఓ తాబేలు కథ (Tortoise And The Boy)

                                                      ఓ మనిషి ఓ తాబేలు కథ 

అనగనగా ఓ రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో నివసించే ఒక దంపతులకు సంతానం కలగలేదు ఎన్నో నోములు వ్రతాలూ చేసిన తరువాత ఒక కొడుకు పుట్టాడు కొడుకుకి రాము అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకున్నారు .

రాము 8వ తరగతి చదువుతున్నపుడు అక్కడి పిల్లలందరూ విహారయాత్రకి గంగానదిని చూడటానికి వెళ్లారు . రాముకి అక్కడి వాతావరణం  ప్రశాంతత చాల బాగా నచ్చాయి . అతను అక్కడ కూర్చొని గల గల పారుతున్న ఆ నదిని చూస్తూ ఉండగా దూరంగా కొందరు పిల్లలు ఒక చోట చేరి అల్లరి చేయడం మొదలుపెట్టారు అది గమనించిన రాము అక్కడికి వెళ్లి చూసాడు ఆ పిల్లలంతా ఒడ్డుకి వచ్చిన ఒక తాబేలుని అటు ఇటు పీకుతూ దానితో ఆడుకుంటున్నారు అది చుసిన రాముకి చాల బాధ కలిగింది  పిల్లలందరిని అక్కడి నుంచి పంపించివేశారు .

 ఆ తరువాత ఆ తాబేలుని నదిలో వదిలివేసాడు ఆశ్యర్యంగా ఆ తాబేలు మాట్లాడసాగింది ఓ మంచి అబ్బాయి నివ్వు చేసిన మేలు మరువలేనిది నేను నీకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటున్నాను  అని అడిగింది అప్పుడు రాము అమీ అక్కర్లేదు అవసరం వచ్చినపుడు తప్పకుండా అడుగుతాను అని రాము వెళ్ళిపోయాడు . 

ఓ మనిషి ఓ తాబేలు కథ

చాలా సవంత్సరాల తరువాత రాము చాల విద్యలు నేర్చుకొని యుక్త వయస్సుకి వచ్చి వీరుడిగా పేరు తెచ్చుకున్నాడు . 

ఒకసారి ఆ దేశపు రాజుగారి కూతురు తన స్నేహితురాలతో గంగానదిలో స్నానానికి వెల్లింది అక్కడ తన రత్నాల హారం నదిలో పడిపోయింది ..చాల మహిమ కలిగిన ఆ హారం అంటే ఆమెకు చాల ఇష్టం ఆ బెంగతో రాకుమారి సరిగ్గా భోజనం కూడా చేయడం లేదు ఎవరు ఎంత చెప్పి చుసిన ఆమె బెంగ మాత్రం తీరలేదు దీనితో రాజుగారు గజఈతగాళ్లను పిలిపించి అమిత వేగంగా ప్రవహించే గంగానదిలోకి పంపించారు కానీ ఆ నది వేగానికి వాళ్ళందరూ కాగితపు పడవల్ల కొట్టుకుపోయారు మరికొందరు నదిలో మొసళ్ళకు ఆహారం అయ్యారు ఇంకా చేసేది ఏమి లేక తెలివికలవారు సాహసవంతులైన యువకులు ఎవరైనా ఆ రత్నాల హారాన్ని తిరిగి తెస్తే న కుమార్తను ఇచ్చి వివాహం చేసి అర్ద రాజ్యాన్ని కూడా ఇస్తానని చాటింపు వేయించారు .

ఆ చాట్టింపు విన్న రాము ఆలోచనల్లో పడ్డాడు ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యం అవుతుంది అని మనస్సులో అనుకోని రాము నదిలోకి దూకి రాళ్ల అడుగనా హారాన్ని వెతకడం ప్రారంబించాడు అతని ప్రయత్నం ఫలించింది ఒక పెద్ద బండరాతి అడుగున మెరుస్తూ ఏదో తన కంట పడింది దానిని చేరుకున్నే ప్రయత్నంలో సుడిగుండంలో చిక్కుకున్నాడు ఇంకా నా ప్రాణాలు పోయినట్లే అని రాము అనుకున్నాడు ఇంతలో తాను నీటి పైకి తేలాడు ఎలా అని ఆశ్చర్యంగా పక్కనే ఉన్న తాబేలుని చూసాడు ఆ తాబేలే రాము ప్రాణాలను కాపాడి తాను వెతుకుతున్న హారాన్ని కూడా తెచ్చి ఇచ్చింది ఆ హారాన్ని తీసుకోని రాము నేరుగా రాజు వద్దకు వెళ్ళాడు హారాన్ని రాకుమారి ఇచ్చాడు సంతోషంతో రాజు తన కుమార్తను ఇవ్వడమే కాకుండా అర్ద రాజ్యం ఇచ్చి గౌరవించాడు. 

ఆ తరువాత రాము రాజ్యాన్ని చక్కగా పాలించి దయ గల రాజుగా పేరు తెచ్చుకున్నాడు 

నీతి (Moral)

ఆపద ఉన్నవారికి కావచ్చు అవసరంలో ఉన్నవారికి కావచ్చు చేయూతని ఇస్తే చేసిన మంచి ఎక్కడికి పోదు ఏదో ఒక రూపంలో అది రెట్టింపుగా తిరిగి ఫలితాన్ని ఇస్తుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు .

Post a Comment

0 Comments