ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక చిరునవ్వు చాలు నిన్ను చిన్న చూపు చుసిన వారికీ నువ్వు ఇచ్చే సమాధానము.
ఆలస్యం చేయడం వలన సులువైన పని కష్టం అవుతుంది కష్టమైన పని అసాధ్యం అవుతుంది.
డబ్బు సంపాదించడం అనేది బావిలో నీళ్ళని తోడడం లాంటిది ఖర్చుపెట్టడం అనేది చేతులను నీళ్లతో కడగడం లాంటిది చాల తేలికైన పని.
చిటికి మాటికీ అలిగే వారి మనస్సు చాల స్వచంగా ఉంటుంది వారిని అర్ధం చేసుకుంటే ఙివితం అద్భుతంగా ఉంటుంది.
ఒక క్షణ్ణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక క్షణ్ణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది.
ముందు మార్పు మనం కావాలి ఆ తరువాత మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చుకోవచ్చు. మనస్ఫూర్తిగా పని చేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు.
అనుభూతుల పుట్టినిల్లు పల్లెలు అనుభవాల సాలెగూళ్ళు పట్టణాలు.
కోరుకున్నది దొరకనంత కలం మనిషి దాని వెంట పడుతూనే ఉంటాడు దొరికాగా దానిని అస్సలు పట్టించుకోడు అది ఏదైన కావచ్చు.
ఈ నైజాన్ని మార్చుకున్నపుడు మనిషి కొత్త మార్పు చూస్తాడు.
మిత్రమా అఖరిగా ఒక్క మాటరాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే పగలంతా ప్రకాశిస్తాడు రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రి అవగానే వెన్నల కురిపిస్తాడు.
ప్రతి ఒకరికి సమయం వస్తుంది కావలసిందల్లా ఓపిక ఇది రాసి పెట్టుకో.


0 Comments