header ads

INSPIRATIONAL STORY HOW TO CONTROL EMOTIONS అవమానాన్ని ఎలా ఎదురుకోవాలి

                                            అవమానాన్ని ఎలా ఎదురుకోవాలి 

మనిషికి తెలివి తేటలు ఎంత అవసరమో భావోద్వేగాలు కూడా అంతే అవసరం అతిగా ఉన్న తన Emotions Control చేసుకోలేని  వ్యక్తి ఏ రంగంలోను విజయం సాధించలేడు. ఒక వేళా విజయం  సాధించిన దాన్ని ఎక్కువ కలం నిలబెట్టుకోలేరు

 చిన్న ఉదాహరణకి ఎవరైనా మనల్ని నిందిస్తే అవమానిస్తే వెంటనే మనం ఏం చేస్తాం తిరిగి నిందిస్తాం లేదా వాళ్ళు మన కంటే బలవంతులు అయితే వాళ్ళను ఏమి అనలేక బాదపడతాం ,మనలో మనమే కుమిలిపోతూఉంటాం.

మనకున్న తెలివి తేటలు ఒక పనిని ఎంత సమర్థవంతంగా చెయగలమోనని మాత్రమే చెపుతాయి సమాజంలో అందరితో కలిసి జీవించాలి అంటే తెలివితేటలూ మాత్రమే సరిపోవు భావావేక్తికరణ ఎంతో అవసరం అది మన స్థాన్నాన్ని సమాజంలో నిర్దేశిస్తుంది. కోపం, దుఃఖం ఆసహనం, చిరాకు ,ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి మీద చూపించాలో మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇవి తెలియని రోజున ప్రక్క వారితో సరైన బంధాన్ని అనుభంధాన్ని పెంచుకోలేము. ఈ జ్ఞానం చాలా మందికి అస్సలు ఉండదు నీ మాటను, కోపాన్ని, ఆవేశాన్ని, నిది కానీ సమయంలో నియంత్రించుకుంటే మన స్థానం బలపడుతుంది విజయం సాధించే అవకాశాలు కూడా పెరుగుతాయి .

మన జీవితంలో ఎవరైనా తీవ్రంగా అవమానిస్తే విమర్శిస్తే వాటిని ఎలా స్పందించాలో ఒక మంచి బుద్దుని కథ తో తెలుసుకుందాం. 

ఒక రోజు బుద్దుడు తన శిష్యులతో కలిసి తన ఆశ్రమానికి ప్రక్కనే ఉన్న గ్రామానికి బిక్షాటనికి వెళ్ళాడు, అదే ఊరిలో మహా పిసినారి అయినా వ్యాపారి ఉండేవాడు అతను ఎవరికి చిల్లిగవ్వ కూడా దానంగా ఇచ్చి ఎరగడు, తన ఇంటికి ఎవరు  సహాయం కోసం వచ్చిన వారిని తీవ్రంగా అవమానించి పంపేవాడు, బుద్దుడు ఆ వ్యాపారి ఇంటి ముందుకి వచ్చి స్వామి మాకు కొంచెం భిక్షను దానం చేయండి అని ఆ వ్యాపారిని అడిగాడు, అప్పుడు ఆ వ్యాపారి కోపంతో పరుగుపరుగున వచ్చి సిగ్గు లేదా మీకు ఏ పని పాట లేకుండా ఇలా ఊరి మీద పడి అడుక్కోకపోతే ఇంకా ఏదైనా పని చేసుకోవచ్చు కదా ఎందుకు నాలాంటి వార మీద పడి ఏడుస్తారు, ఇలా ఇతరుల మీద పడి బతికే బదులు ఏ గంగలోనైనా దూకండి అందరూ ఎందుకు మీ బ్రతుకులు అని పెద్దగా అరిచాడు ఆ వ్యాపారి.

 అప్పుడు వారిలో ఏమి మాట్లాడకుండా నిశ్చలంగా నవ్వుతూ ఉన్న వ్యక్తిని చూసి ఆ వ్యాపారికి కోపం రెట్టింపు అయింది అప్పుడు మరల ఇలా అన్నాడు ముందు మిమల్ని కాదు మిమ్మల్ని ఇలా తయారు చేసి మాయమాటలు చెపుతున్న ఆ బుద్దున్ని అనాలి అంటూ ననా మాటలు అనసాగాడు. వెంటనే ఓ శిష్యుడు మీరు మాట్లాడుతుంది గౌతమ బుద్దుని తోనే అని చెప్పాడు అప్పుడు బుద్దుడు ఆ  వ్యాపారితో మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా అని అడిగాడు. అందుకు ఆ వ్యాపారి ఆ......  ఆ ......... దానికేముంది నిరభ్యంతరంగా అడుగు అని అన్నాడు కోపంగా మీరు నాకు భిక్షను దానం ఇస్తే దానిని నేను తీసుకోకపోతే ఏమైతుంది అని అడిగాడు బుద్దుడు చిరునవ్వుతో ఆ వ్యాపారిని. 

  అపుడు వ్యాపారి ఏమిఅవుతుంది అది న వద్దనే ఉంటుంది అన్నాడు కోపంగా ,

ఇప్పుడు మీరు అన్న మాటలను చేసిన అవమానాలను నేను స్వీకరించకపోతే అవి కూడా మీ దెగ్గరే ఉండిపోతాయి కదా!  నేను వాటిని తీసుకోవడంలేదు వాటిని మీ దగ్గరే ఉండనివ్వండి ,కానీ ఒక్క మాట శృతి మించిన మీ మాటలు మీ మనస్సుని బాధపెట్టకుండా చూసుకోండి ,మీ మాటలతో మనశాంతిని కొలిపోకండి అని అన్నాడు గౌతమ బుద్దుడు. 

 అప్పుడు అర్ధం అయింది ఆ వ్యాపారికి ఇంత కలం అతను ఇతరులను ఎంతలా బాధపెట్టాడో అని. బుద్దుని పాదాల ఫై పడి కన్నీటితో క్షమాపణ వేడుకున్నాడు, అప్పుడు బుద్దుడు ఆ వ్యాపారిని ఓదార్చి కొత్త జీవితానికి మార్గదర్శిక సూత్రాలను ఉపదేశించాడు, తన Emotions ని ఎలా Control చేసుకోవాలో తెలుసుకున్నాడు ఆ వ్యాపారి .

అవమానాన్ని ఎలా ఎదురుకోవాలి

 



 

Post a Comment

0 Comments