header ads

మన ఆలోచనలో మార్పు తెప్పించే అద్భుతమైన కధ

 మన ఆలోచనలో మార్పు తెప్పించే అద్భుతమైన కధ 


రాత్రి చీకటి పడుతుంది తాళ్ళం ఇనప ద్వారం బయటి  నుండి ఒక పిలుపు ఎవరా అని వచ్చి చూసాను గుమ్మం ముందు ఒక పెద్దాయన చాలా దూరం వచ్చినట్లుగా నలిగి పోయిన బట్టలు చేతిలో ఒక చిన్న సంచితో నిలబడి ఉన్నాడు. ఆ సంచిలో ఉన్న చిన్న కాగితాన్ని తీసి ఆనంద్ Numder 8 యోగానంద విధి ఇదేనా అని అడిగాడు అవును నేనే ఆనంద్ ఇదే చిరునామా మీరు ఎవరు అని అడిగను దానికి ఆ

మన ఆలోచనలో మార్పు తెప్పించే అద్భుతమైన కధ

పెద్దాయన బాబు నేను మీ నాన్నగారి మిత్రుణ్ణి మీ ఊరి నిండి వస్తున్నాను నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సహాయం తీసుకోమన్నారు అని ఆ ఉత్తరాన్ని ఆనంద్ చేతిలో పెట్టాడు. 




ఆ ఉత్తరాన్ని ఆనంద్ ఎంతో ఆత్రంగా చదవసాగాడు ఆ ఉత్తరంలో. 

ప్రియమైన ఆనంద్ నీకు నా ఆశీర్వాదములు ఈ ఉత్తరం తీసుకోని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు పేరు రామయ్య చాలా కష్ట జివి కొద్దీ రోజుల క్రితం ఈయన కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయాడు నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు అది వస్తే ఆయనకు అయన భార్యకు రోజు గడవడానికి  కాస్త తోడవుతుంది. యాక్సిడెంట్ జరిగిన తరువాత Police వారి విచారణలు ట్రావెల్స్ వారు ఇస్తానన్న నష్టపరిహారపు పేపర్స్ అన్నింటిని సేకరించి నీకు పంపుతున్న డబ్బులు Head Office లో తీసుకోమన్నారు. ఆయనికి నీవు ఉన్న ఊరు కొత్త ఏమి తెలియదు నువ్వు ఆయనికి సాయం చేస్తావని నమ్ముతున్న నీ ఆరోగ్యం జాగ్రత్త కుదిరినప్పుడు ఒకసారి ఊరికి రావలసిందిగా కోరుతూ ఇట్లు మీ నాన్న అనిరుద్. 

నన్నే చూస్తూ నిలబడి ఉన్న రామయ్య గారిని లోపలికి ఆహ్వానించాను మంచి నీళ్లు ఇచ్చి ఏమైనా తిన్నారా అని అడిగాను దానికి సమాధానంగా లేదు బాబు ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో తెచ్చుకున్న రెండు పండ్లు మాత్రం తిన్నాను అని చెప్పారు వెంటనే ఆనంద్ దోసెలు వేసి తీసుకువచ్చి ఆయనికి ఇచ్చి తినమని చెప్పి బయటికి వచ్చి కొన్ని Phone Calls చేసుకొని లోపలికి వచ్చి చుసేటప్పటికీ రామయ్య దోసెలు ఆరగించి చేతిలో కొన్ని Papers ని పట్టుకొని కూర్చున్నాడు నేను రాగానే నా చేతిలో పెట్టాడు అందులో యాక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి Photo కూడా ఉంది. కుర్రవాడు అందంగా కూడా ఉన్నాడు సుమారు 23 to 25 సంవత్సరాలు ఉంటాయి. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వీడు నా ఒక్కగానొక్క కొడుకు మిగిలిన వారందరు చిన్నతనంలోనే అనేక కారణాల వలన చనిపోయారు వీడు మాత్రమే మాకు మిగిలాడు పేరు  మహేష్ కష్టపడి చదివించాను బాగా చదివి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు మమ్మల్ని చూసుకుంటానని కష్టాలన్నీ తీరిపోతాయని అని చెప్పి ఉద్యోగంలో చేరాడు ఆ రోజు రోడ్డు దాటుతూ ఉండగ యాక్సిడెంట్ జరిగింది అక్కడికక్కడే చనిపోయాడు నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చే పైకం వద్దు అనుకున్నాను కానీ రోజు రోజుకి నాలో శక్తి తగ్గిపోతుంది నా భార్య ఆరోగ్యం బాగాలేదు మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను నా కొడుకు సాయం చేస్తాడని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి మీ నాన్న నన్ను పంపారు అని ముగించారు ఆయన. 

సరే పొద్దయిపోయింది పాడుకొండి అని చెప్పి నేను కూడా పడుకున్నాను ఉదయాన్నే ఆ Papers లోని Address ఉన్న Office కి చేరుకున్నాం ఆనంద్ నేను చూసుకుంటాను నువ్వు Office కి వేళ్ళు అన్నారు ఆయన పర్లేదండి నేను Office కి Leave పెట్టాను అని అన్నాను దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను. చాలా Thanks బాబు నేను ఇంకా ఊరికి బయలుదేరుతాను మా ఆవిడా ఒక్కటే ఉంటుంది ఇంట్లో అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్దమయ్యారు రామయ్య గారు రండి నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా అని చెప్పి Ticket తీసి ఇచ్చి ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి ఇవి తెచ్చి రామయ్య గారి చేతిలో పెట్టాను ఆయన సొంతోషంగా ఆనంద్ బాబు నా కోసం సెలవు పెట్టుకొని చాల సహాయం చేసావు ఊరు వెళ్ళగానే మీ నాన్నగారికి అన్ని విషయాలు చెప్పాలి కృతఙ్ఞతలు తెలియచేయాలి అని అన్నాడు. అప్పుడు నేను రామయ్య గారి చేతులు పట్టుకొని నేను మీ స్నేహితుని కొడుకు ఆనంద్ ని కాదండి నా పేరు కూడా ఆనందే ఆ ఆనంద్ ఇంటికి వెళ్లాలంటే అర్థరాత్రి పుట మరో 2 కిలోమీటర్ దూరం వెళ్ళాలి మీరేమో అలసిపోయి ఉన్నారు అందుకే నేను నిజం చెప్పలేదు మీరు తెచ్చిన Latter లో Phone Number ఉండటంతో వారికీ రాత్రే Phone చేశాను ఆ ఆనంద్ ఎదో పని మీద వేరే ఊరు వెళ్ళారంట ఆయన భార్య చెప్పారు మీ మిత్రునికి విషయం  చెప్పలేండి ఆయన చాలా బాద పడ్డారు నేను దెగ్గరుండీ చూసుకుంటాను అని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది కాని ఏదో నాకు చేతనైన సహాయం చేయాలి అనిపించింది నాకు ఆ తృప్తి చలాండి అని అన్నాను అదే సందర్భంలో బస్సు ముందుకు కదలడంతో ఒకసారి రామయ్య గారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతఙ్ఞతలు తెలిపారు నువ్వు బాగుండాలి బాబు అని ఆశీర్వదించారు ఆ మాటే చాలు అనుకున్నాను నేను 15సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటె అయన మొఖంలో మా నాన్నగారు కనిపించారు ఆకాశంలోకి చూసాను అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న 

నాన్న నా అభివృద్ధి చూడటానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు ఒక ఉత్తరం తీసుకోని వచ్చి నాకు చూపి నేను సహాయం చేస్తానో లేదో అని నన్ను పరీక్షించవా నీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను నాన్న . మీకు సంతోషమేనా నాన్న అంటూ ఆనందబాష్పలు రాల్చాడు. 

సాయం చేయడానికి మనసుంటే చాలు మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి కాదా .... .... 





Post a Comment

0 Comments