header ads

మాట యొక్క ప్రాముక్యత MOTIVETIONAL STORY ABOUT IMPARTANCE OF TALKING

                                                 మాట యొక్క ప్రాముఖ్యత 

  గౌతమ బుద్ధుడు తన శిషులతో కలసి వేరే ఊరు వెళ్తున్నాడు సాయంత్రం అవడంతో ఒక అరణ్య ప్రాంతంలో తాత్కాలిక విడిదిని ఏర్పాటు చేసుకున్నారు భోజనాలు అయిపోయన తరువాత శిషులంతా కలసి గౌతమ బుద్ధుని వద్దకు వెళ్లారు వారు అందరూ బుద్ధునికి ఎదురుగా కూర్చున్నారు అపుడు ఒక శిష్యుడు స్వామి మీరు మాకు ఎన్నో జీవిత సత్యాలు తెలియజేసారు ఈ రోజు ఏదైనా కొత్త విషయాన్ని చెప్పండి అని అడిగారు .

 కథ  

 ఈరోజు మనం మాట సమాజంలో మనల్ని ఎలా నిర్దేశిస్తుందో మాట యొక్క ప్రాముక్యత ఏమిటో తెలియజేసే కథను చెపుతాను. 

 అనగనగా ఒక రాజు తన పరివారంతో కలిసి వేటకు బయలుదేరాడు వాళ్ళంతా ఎంతో శ్రమ పది వేటాడసాగారు కానీ వారు ఏ జంతువుని వేటాడలేకపోయారు వాళ్ళంతా ఆ అడవిలో దారి తప్పారు రాజు తన అరివారాన్ని వెతుక్కుంటూ అడవి అంత తిరుగుతూ ఉండగా. 

 రాజుకు ఒక వృద్ధుడు ,అంధుడు అయినా ఒక ఋషి కనిపించాడు రాజు ఆ ఋషి వద్దకు వెళ్లి యోగి మహారాజా మేము ఈ అడవికి వేట కోసం వచ్చి దారి తప్పాము మా వాళ్ళు ఎవరైనా ఇటుగా వెళ్లారేమో సెలవివ్వండి అని అడిగాడు .

 అప్పుడు ఆ మహర్షి మహారాజా ముందుగా మీ సైనికుడు ఈ దారి గుండా వెళ్ళాడు ఆ తరువాత మీ మంత్రి కూడా ఇదే మార్గం గుండా వెళ్ళాడు మీరు కూడా ఇదే మార్గం గుండా వెళ్ళినట్లైతే మీరు వారిని చేరుకోవచ్చు అని చెప్పాడు అప్పుడు అతని గ్రహణ శక్తికి ఎంతో ఆశ్చర్యపోయాడు ఆ రాజు, 

స్వామి మీరు అంధులు కదా నాకంటే ముందుగా ఎవరెవరు వెళ్లారో అంతా ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాడు రాజు ఆ మహర్షిని .

అపుడు ఆ మహర్షి అందులో ఏ వింత లేదు మహారాజ. 



మొదటగా వెళ్ళిన మీ సైనికుడు నన్ను చూసి ఓ గుడ్డోడా ఎటువైపుగా ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు కొద్దిసేపటి తరువాత మీ మంత్రి వచ్చాడు అతను నన్ను అయ్యా యోగి పుంగవా ఇటుగా నాకంటే ముందు ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు ఆ తరువాత మీరు ఇక్కడికి వచ్చారు మీరు నన్ను ఓ రాజు ఋషులను మునులను ఎలా గౌరవిస్తారో అల గౌరవించారు వారి వారి మాటలను బట్టి వాళ్ళ స్థానాన్ని అంచనా వేసాను అని అన్నాడు ఆ రాజుతో అలాగే మన మాట తీరుతోనే సమాజంలో మన స్థానం ఏమిటో నిర్దేశించబడుతుంది కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటను ఉన్నతంగా మాట్లాడండి నాలుకను మీ అదుపులో ఉంచుకొండి అప్పుడే మీకు సమాజంలో తగిన గౌరవం లభిస్తుంది అని చెప్పి కథను ముగించాడు గౌతమ బుద్ధుడు కథను విని శిష్యులంతా ఎంతో సంతోషించారు.


Post a Comment

0 Comments