header ads

MOTIVETIONAL WORDS ABOUT HOW TO READ ఎలా చదవాలి

                                        ఎలా చదవాలి 


మిమల్ని Toppers అవ్వమని అనడం లేదు, బాగా చదివి దేశంలోని అవినీతిని పారద్రోలామని అనడం లేదు, ఆశర్యవంతులుగా మారమని అనడం లేదు, కానీ మీ ఇంట్లో వారికీ మీరు భారంగా మారనంత వరకు చదవండి.

 ఈ రోజు మీ అమ్మ నాన్న కళ్ళలో కారే కన్నీరు ఆనంద బాష్పలుగా మారె వరకు చదవండి, మిమల్ని చీదరించుకుని దూరంగా వెళ్లిన వారు మిమ్మల్ని చూసి సిగ్గు పడేలాగా చదవండి, మీ నాన్న గారి జేబులో చిల్లర డబ్బులు కాకుండా Credit Card చూసేంతవరుకు చదవండి.

 కుటంబం పై మనం ఆధారపడకుండా మనపై కుటంబం మొత్తం నీ పై ఆధారపడేలా చదవండి, తల్లిదండ్రులకు జీవితంలో నివ్వు ఎలా పైకి వస్తావు అని కాకుండా ఇంత మందికి నా కూతురు, కొడుకు ఆకలి తీరుస్తున్నారా అనేలా ఆశర్యపోయేలా చదవండి.

 ఈ రోజు నీ కళ్ళను తుడిచే చేయీ నీలాంటి వెయ్యీ మంది గుండేల్లో ధైర్యాన్ని నింపే వారి కన్నీళ్లు తుడిచే చేయీలా మారె వరకు చదవండి, జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు మనకి కష్టాలు వచ్చినప్పుడు ఎవరు మనకు తోడు ఉన్న లేకున్నా నివ్వు చదువుకున్న చదువు మాత్రం ఎప్పుడు వృధా కాదు

 అందుకే అంటారు మంచి స్నేహితుడి కన్నా మంచి పుస్తకం మిన్న అని .


మనిషికి ఎన్ని తెలివితేటలు ,జ్ఞానం ఉన్న అవి తన పరిమితి కలం వరకే ఉంటాయి కానీ నువ్వు చదివి సంపాదించిన degree లు మాత్రమే నువ్వు ఉన్న లేకున్నా నీకు గుర్తింపు తీసుకొచ్చి పెడతాయి సమాజంలో నీకంటూ ఒక గౌరవం ఉంటుంది నివ్వు ఎంత కస్టపడి చదివితే అంత ఉన్నత శిఖరాలకు చేరుతావు .నివ్వు ఎంత కష్టాలలో ఉన్న వాటిని తట్టుకొని నిలబడే శక్తిని జ్ఞానాన్ని పొందుతారు. 

అంబానీ టాటా బిర్ల లాంటి వారు కూడా కష్టాలను అనుభవించి పేదరికం నుంచి వచ్చిన వారే కానీ ఈ రోజున వాళ్ళు ఎంతో మందికి Inspiration గా నిలిచారు అలాగే నివ్వు కూడా ఎంత కష్టపడి చదివితే అంత బాగా స్థిరపడి ఎంతో మందికి Help చేయగలవు. 

ముందుగా నివ్వు ఒక Goal ని పెట్టుకొని కష్టపడి చదివి సాధిస్తే నీకు ఈ లోకం దాసోహం అవుతుంది అందరూ నీకు Friends అవుతారు నివ్వు జీవితంలో ఎలా ఉండాలి అనేది నీ నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది .


Post a Comment

0 Comments