header ads

INTELLIGENT SHEPHERD తెలివైన గొర్రిలా కాపరి

                                                   తెలివైన గొర్రిలా కాపరి 

 ఓ ఘటన ఓ వ్యక్తితో పరిచయం ఒక చర్చ మనకి కొత్త పాఠాన్ని నేర్పవచ్చు ఓ ధర్మాన్ని సత్యాన్ని చూపవచ్చు మన అస్థిర అభిప్రాయాలను మార్చుకోవచ్చు వాటిన చూసే కోణంలో ఓ కొత్త చూపునివ్వనువచ్చు. 

ఇది నాకు బాగా తెలుసు నాదే  సరైన ఆలోచన నేను చెప్పిందే సరైనది అన్న అహంకారపూరిత ఆలోచనలను కొన్ని సందర్భాలు తోసిరాదని మనల్నిదిగ్భ్రాంతులను చేయవచ్చు. 

కథ    

 దేనినైనా గణించి తక్కువ సమయంలో చప్పగల వాడిగా లబ్ది ప్రతిష్ఠుడైనా ఓ పండితుడిలో గర్వం పొడచూపిందీ.


 ఓ గ్రామ పొలిమేరల్లో తారసపడిన నిరక్ష్యరాసుడైన పశువుల కాపారితో తన  శక్తిని గూర్చి గొప్పలు చెప్పసాగాడు ఆయనతో మాట్లాడుతూ ఆ పశువుల కాపారి తన అరచేతిలోకి ఇసుకను తీసుకోని అరచేతిని మూసి అయ్యా ఈ ఇసుకని గణించి ఎంత ఉందొ చెప్పగలరా అన్నాడు. 
తెలివైన గొర్రిలా కాపరి

ఆ ప్రశ్న ఆ గణికుణ్ణి నిర్దంత పరిచింది నివ్వెరపోతూ తన వంకే చూస్తున ఆ పండితుడితో ఆ నిరక్ష్య కుక్షి ఇది గుప్పెడు ఇసుక బొటన వేలుకు చూపుడు వేలుకు మధ్య ఉన్న ఇసుకను చిటికెడు అని రెండు అరచేతుల్లో ఉంటే దోసెడు అని అంటారు స్వామి అని వివరించాడు తన అహంకారానికి సిగ్గు పడుతూ ఆ కాపారి లోక జ్ఞానానికి అబ్బుర పడ్డాడు ఆ మహా గణికుడు. 

జీవితంలో ఎదురయే అనేక అనుభవాలు మనకు ఎంతో నేర్పుతాయి తారసపడే వ్యక్తులు మనకన్నా జ్ఞానవంతులు కావచ్చు, ఇవి మనకు తెలిసిన ఓ విషయాన్నో, ధర్మాన్నో, సత్యాన్నో, కొత్తరీతిలో ఆవిష్కరించవచ్చు.

     తెలియని దాన్ని అద్భుతంగా చెప్పవచు ఎందరో మహానుభావులు అని త్యాగయ్య అనడంలో అర్ధం ఇదే నేర్చుకోవడం అనేది ఒక నిర్ణిత కాలానికి పరిమితం కాదు మనలో తపన ఉన్నంతకాలం అది ఓ నది ప్రవాహంలా కొనసాగుతూనే ఉంటంది. ఇలాంటి అద్భుత రచనలు చేసిన ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.

Post a Comment

0 Comments