ఎదుటి వారికి సాయం చేయడానికి కావలిసినది డబ్బు కాదు మనస్సు
ఒక సారి చాలా పేదవాడు బుద్ధుని వద్దకు వచ్చి నేను ఎందుకు పేదవాణ్ణి అని అడిగాడు, దానికి సమాధానంగా బుద్ధుడు మీరు ఎందుకు పేదవారు అంటె ఎటువంటి ఔదార్యం కలిగిలేరు దానధర్మాలు చేయరు కాబట్టి అని సమాధానం ఇచ్చాడు. నేను ఇతరులకు దానం చేయడానికి నా వద్ద ఏమున్నది అని ఆ పేదవాడు తిరుగు ప్రశ్న?
అప్పుడు బుద్ధుడు మీరు ఇతరులతో పంచుకో గల 5 నిధుల కలిగి ఉన్నారు
రెండోవది మీ కళ్ళు మీరు ప్రేమ మరియు శ్రద్ధతో ఇతరులను చూపవచ్చు నిజం మీరు లక్షలాది మందిని ప్రభావితం చేయవచ్చు వాటిని మంచి అనుభూతిగా చేయండి.
మూడొవది మీ నోరు మీ నోరుతో మీరు ఇతరులకు మంచి విషయాలను చెప్పవచ్చు మంచిని చర్చించండి వాటిని విలువైనదిగా భావించండి దానితో ఆనందం సానుకూలత వ్యాప్తి చెందుతాయి .
నాలుగోవది మీ ప్రేమ గల హృదయంలో మీరు ఇతరులకు ఆనందాన్ని కోరుకోవచ్చు ఇతరులను బావోద్వేగాలను అనుభూతి చెందవచ్చు వారి జీవితాలను తాకవచ్చు.
ఐదోవది చివరి సంపద మీ శరీరం. మీ శరీరంతో ఇతరులకు అనేక మంచి పనులను చేయగలరు అవసరమైన వారికీ సహాయం చేయగలరు . సహాయం చేయడానికి డబ్బు ఒక్కటే అవసరం లేదు ఒక చిన్న శ్రద్ధా ,ప్రేమ జీవితాలను వెలింగించగలవు .
భగవంతుడు మనకు ఇచ్చిన జీవితం కల కానిది విలువైనది సర్వోత్తమమైనది ప్రతి క్షణం ఆనందంగా ఉంటూ పదిమందికి సహాయ పడుతూ ఈ జన్మను చరితార్థం చేసుకోవచ్చు అని బుద్ధుడు సెలవిచ్చాడు .
బుద్ధం శరణం గచ్చామి

0 Comments