header ads

గౌతమ బుద్ధుని నీతి కథ = Bhagavan Buddhuni Moral Story For Children

                                   పిల్లవాడిలో మార్పు 
  బుద్దుడు వైశాలి లో ఉన్నపుడు ఒక తల్లి తన బిడ్డని తీసుకొనివచ్చింది భగవాన్ వీడు పొరుగు వాని తోటలోనుంచి మామిడి కాయలను కోసుకొనివస్తున్నాడు వీడిని ఎలాగైనా మార్చమని భగవాన్ తో విన్నవించింది.

నిజమేనా అని అడిగాడు బుద్దుడు  పిల్లవాణ్ణి !

నిజమే ఆ తోట చుట్టూ గోడ కానీ కంచె కానీ లేవు అవి ఉంటే వెళ్ళ వాణ్ణి కాదు అని అన్నాడు పిల్లవాడు అందులో తన తప్పుఏమి లేనట్టు.
  
బుద్ధుడు నవ్వుతూ అలాగా,
      నువ్వు ఒక దారిలో వాస్తు బురద గుంటలో పడ్డావు అనుకో ఆ పక్కనే మంచినీటి చెరువు వుంది అనుకో నీవు వెళ్ళి శుభ్రం చేసుకోలేదు అనుకో అది ఎవరి తప్పు నీ తప్ప ఆ మంచినీటి చెరువు తప్ప అని అడిగాడు బుద్ధుడు, అయ్యో భగవాన్ చెరువు తప్పు ఎలా అవుతుంది నా తప్పె కదా అంటూ నవ్వాడు పిల్లవాడు, 

సరే,
      నీకు జ్వరం తగిలింది అనుకో మీ ఊళ్ళో ఒక వైద్యుడు ఉన్నాడు అనుకో నీవు వెళ్లి ఆ వైద్యునికి చూపించుకోలేదు అనుకో అది ఎవరి తప్పు నిదా వైద్యునిదా అని బుద్ధుని ప్రశ్న? . పిల్లవాడు నవ్వుతూ అది వైద్యుని తప్పు ఎలా అవుతుంది భగవాన్ ఆ మాత్రం తెలియదా అది నా తప్పే అని అన్నాడు పిల్లవాడు. 

సరే,
      ఇది  చెప్పు కంచె లేకపోవడం వలన మామిడి కాయలని దొంగిలించాను అన్నావు కదా నీవు చేసిన పనికి తప్పు కంచేదా నీదా అని చిరునవ్వుతో ప్రశ్నించాడు బుద్ధుడు. 
        అది. . . , మరి. . . .   మరి. . .   మ. .   రి.  అంటు మాటలు మింగేసాడు పిల్లవాడు అప్పుడు బుద్ధుడు ఆ పిల్లవాణ్ణి దెగ్గరకు తీసుకోని నిదే తప్పుని నీవే చెప్పావు కదా మరి ఇక నుండి ఏమి చేస్తావు అని అడిగాడు. 
        తెలిసి తప్పు చేయను భగవాన్ నా తప్పుని సరిదిద్దుకుంటాను అన్నాడు చిరునవ్వుతో అప్పుడు బుద్ధుడు మంచిది అంటూ ఆ పిల్లవాన్ని వెన్ను నిమిరాడు. 
       ఇలాగే పిల్లలు చేసే తప్పులకు ఓ చక్కని ఉదాహారణలతో వారిలో మార్పుని తీసుకురావచ్చు, ఇలాగే పెద్దవారిలో కూడా మనం చెసేది తప్పు అని తెలిసిన ఆ తప్పు చేస్తూనే ఉంటాము.  కాబట్టి మొదటగా మనం మరి మన తరువాత తరాలకి మంచిని పంచుదాం.  

Post a Comment

0 Comments