సమస్యలని ఎలా ఆదికమించాలి
బుద్ధుడు తన శిష్యులతో ఉన్న సమయాన ఒక గ్రామస్తుడు హఠాతుగా ఏడ్చుకుంటూ వచ్చి బుద్ధుని పాదాలపై పడ్డాడు. అప్పుడు గౌతముడు అతన్ని లేవదీసి ఓదార్చడు అతను కాస్తా నెమ్మదించిన తరువాత ఇప్పుడు చెప్పు నాయనా ఎమైంది అని అడిగాడు ,అప్పుడు గ్రామాస్తుడు స్వామి ఏమి చెప్పమంటారు నా దుస్థితి నేను పక్క ఊళ్ళో పెద్ద రైతుని నా జీవితంలో అన్ని ఉన్నాయి కానీ మనశాంతి లేదు స్వామి రోజురోజుకి నాలో ఆశాంతి పెరిగిపోతుంది రాత్రులు అసలు నిద్ర పట్టడం లేదు దుఃఖం అధికం అవుతుంది వాటిని తగ్గగించుకునే మార్గం నాకు కనపడటం లేదు మీరే ఎలాగైనా నన్ను ఈ నరకం నుండి రక్షించాలి అని బోరున ఏడ్చాడు.
అప్పుడు బూద్ధుడు ఏడవకు నాయన ని స్థితి దుస్థితి నాకు అర్ధం అయినది ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయి నీకు మనశాంతి లభిస్తుంది ఈ రోజుకి నువ్వు ఇంటికి వెళ్ళి కొన్ని ఆవులను ని ఇంటి లోపల కటివేసుకో మల్లి వారం రోజుల తరువాత కనిపిన్చు అని చెప్పాడు.
శిష్యలకు బుద్ధుడు ఎందుకు ఆలా చెప్పాడో అస్సలు అర్ధం కాలేదు వరం తరువాత ఆ గ్రామస్తుడు బుద్ధుని వద్దకు వచ్చాడు ఈ సారి అతని ముఖం ఎంతో కళాహీనంగా ఉంది బుద్దుని చూడగానే అతనికి దుఃఖం ముంచుకొచ్చింది అప్పుడు దీనంగా స్వామి అన్నాడు. అప్పుడు బుద్దుడు ఓ చిరునవ్వుతో ఇప్పుడు ఇంటికి వెళ్లి ఇంట్లో కట్టేసుకున్న ఆవులను తీసుకువెళ్లి బయట కట్టేయి రెండు రోజుల తరువాత నా దగ్గరకు రా అని చెప్పి పంపించివేశాడు.
ఇపుడు కూడా ఆశ్చర్యపోవడం శిష్యుల వంతు అయింది రెండు రోజుల తరువాత ఎంతో సంతోషం తో బుద్దుని వద్దకు వచ్చాడు ఆ గ్రామస్తుడు స్వామి ఇపుడు నా మనస్సు ప్రశాంతంగా ఉంది ఈ రెండు రోజులు నేను ఎంతో హాయిగా నిద్రపోయాను ఆ ఆవుల అరుపులతో వరం రోజులు నాకు అస్సలు నిద్ర పట్టలేదు అని ఎంతో సంతోషంగా చెప్పాడు .
అపుడు బుద్దుడు నాకు అర్ధం అయింది నాయనా నువ్వు జీవితంలో ప్రతి దాన్ని సమస్యగా చూస్తున్నావు అందుకే నీకు ప్రతిదీ సమస్యగా కనిపిస్తుంది నీ దృష్టిలో నువ్వు సమస్యలుగా బావించినవి ఏవి సమస్యలే కాదు నీ సౌకర్యానికి భంగం కలిగించే ప్రతిదీ నిన్ను ఇబ్బంది పెడుతుంది ఇంట్లో కాటేసిన అవుల్లాగా ఎప్పుడైతే ఆవులను బయటకు తోలేసేవా ఎప్పుడైతే నీకు జీవితంలో సౌకర్యం ఏర్పడిందో అప్పుడు నీకు ని సమస్యలన్ని తీరిపోయినట్లుగా అనిపించాయి మనస్సులో ఎంతో ప్రశాంతతా వచ్చి చేరింది నీకు ఆనందం లభించింది అందుకే అనోవాసరమైన ప్రతి దాన్ని మనస్సులో పెంచుకొని పోషిస్తుంటే అది పెరిగి పెద్దదయి నీ మనస్సు బరువైపోతుంది జీవితం అశాంతితో నిండి పోతుంది అనవసరమైన వాటిని వదిలై నీకేం కావాలో నీకు వీటిలో అనందం దొరుకుతుందో అవే చేయి అని అన్నాడు బుద్దుడు ఇది అంత విన్న ఆ గ్రామస్తుడు తన సమస్య ఏమిటో అర్థమైంది .
బుద్దుని మాటల్లోని అంతర్యం అప్పుడు అర్ధం అయింది అందరికి ఆ గ్రామస్తుడు ఎంతో సంతోషంతో తన ఇంటి దారి పట్టాడు .

0 Comments